కల్తీ ఆహారంపై హెచ్-ఫాస్ట్ అధికారుల భారీ ఆపరేషన్.

Advertisements

<p>ఆహార కల్తీకి పాల్పడుతున్న వారిపై హెచ్-ఫాస్ట్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు&period; నగరంలో భారీ ఆపరేషన్ నిర్వహించి పెద్ద ఎత్తున కల్తీ మసాలా దినుసులను స్వాధీనం చేసుకున్నారు&period; ఈ విషయాన్ని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వెల్లడించారు&period; నగరంలోని 13 మసాలా వ్యాపార సంస్థల్లో నిర్వహించిన సోదాల్లో 25&period;3 టన్నుల కల్తీ మసాలా దినుసులు&comma; 89&period;15 టన్నుల ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు&period; ఈ కేసుల్లో 3 క్రిమినల్ కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు&period; తనిఖీల్లో సింథటిక్ రంగులు&comma; క్లాత్ డైలు&comma; టాల్కమ్ పౌడర్లు&comma; ఇండస్ట్రియల్ కలర్స్&comma; రైస్ బ్రాన్ ఆయిల్ వంటి హానికర పదార్థాలను నకిలీ మసాలాల తయారీలో వినియోగించినట్లు గుర్తించినట్లు సజ్జనార్ వెల్లడించారు&period; ఇలాంటి కల్తీ మసాలాల వినియోగం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు&period; కల్తీ ఆహార పదార్థాల తయారీ&comma; విక్రయాలపై మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు త్వరలో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయనున్నట్లు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.