సిద్దిపేటలో ఆరుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్.

Advertisements

<p>సిద్దిపేట జిల్లాలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు ఉపాధ్యాయులపై జిల్లా కలెక్టర్ హైమావతి సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు&period; ఇటీవల మల్టీపర్పస్ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంగా పలు అవకతవకలు వెలుగులోకి వచ్చాయి&period; తనిఖీల్లో కొందరు ఉపాధ్యాయులు విధుల సమయంలో పాఠశాలను విడిచి ఇంటికి వెళ్లినట్లు గుర్తించారు&period; అలాగే టీచింగ్ డైరీలు సక్రమంగా నిర్వహించకపోవడం&comma; ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదులో కూడా లోపాలు ఉన్నట్లు కలెక్టర్ గుర్తించారు&period; ఈ వ్యవహారంపై వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారిని విచారణకు ఆదేశించగా&comma; విచారణలో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం నిర్ధారణ కావడంతో ఆరుగురిపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు&period; ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని&comma; విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడే నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని జిల్లా కలెక్టర్ హైమావతి హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.