జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద

Advertisements

<p>ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది&period; భారీగా వరద నీరు చేరుతుండటంతో అధికారులు ప్రాజెక్టు 27 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు&period; పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు&period; ప్రస్తుతం 2 లక్షల 5 వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది&period; వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికారులు ప్రాజెక్టు 27 గేట్లను ఎత్తివేసి 2 లక్షల 14 వేల 338 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు&period;ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318&period;516 మీటర్లు కాగా&comma; ప్రస్తుతం నీటిమట్టం 317&period;490 మీటర్లుగా నమోదైంది&period;ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9&period;657 టీఎంసీలు కాగా&comma; ప్రస్తుతం 7&period;627 టీఎంసీల నీరు నిల్వ ఉంది&period; ఇదిలా ఉండగా&comma; ఎగువ&comma; దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది&period;వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.