సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ తరలింపునకు డీకే అరుణ వినతి.

Advertisements

<p>మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సిద్ధాపూర్‌లో ప్రతిపాదించిన జీహెచ్‌ఎంసీ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను ఇతర ప్రాంతానికి తరలించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను కోరారు&period; ఉస్మాన్‌సాగర్&comma; హిమాయత్‌సాగర్ పరిరక్షణకు సంబంధించిన జీవో-111 నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదించారని తెలిపారు&period; డంపింగ్ యార్డ్ వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు శంషాబాద్ విమానాశ్రయానికి బర్డ్ స్ట్రైక్ ముప్పు పెరిగే అవకాశం ఉందని వివరించారు&period; స్థానిక రైతుల జీవనోపాధి&comma; తాగునీటి వనరులు&comma; ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు&period; సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్‌ను ప్రత్యామ్నాయ ప్రాంతానికి తరలించేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర మంత్రిని డీకే అరుణ కోరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నర్సీపట్నంలో అభివృద్ధి పరుగులు.

మల్కాజ్‌గిరిలో ప్రారంభమైన బోనాల సంబరాలు.

ప్రపంచ ఇంధన సరఫరాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలకం.