ఆగస్టు 14న ట్యాంక్‌బండ్ వద్ద భారీ ‘తిరంగా యాత్ర’.

Advertisements

<p>హైదరాబాద్‌లో &OpenCurlyQuote;హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పిలుపునిచ్చారు&period; ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ఆయన కోరారు&period; &OpenCurlyQuote;హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా రామచందర్ రావు తన ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశారు&period; తన ఊరు&comma; తన గల్లీలోని యువతతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు&period; ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన అన్నారు&period; ప్రజలంతా స్వచ్ఛందంగా &OpenCurlyQuote;హర్ ఘర్ తిరంగా’లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు&period; ఇదే సమయంలో ఆగస్టు 14à°¨ హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద భారీ &OpenCurlyQuote;తిరంగా యాత్ర’ నిర్వహించనున్నట్లు రామచందర్ రావు వెల్లడించారు&period; ఈ యాత్ర ఏ ఒక్క పార్టీకి పరిమితం కాదని&comma; దేశ ఐక్యత&comma; శక్తిని ప్రపంచానికి చాటిచెప్పే కార్యక్రమమని పేర్కొన్నారు&period; &OpenCurlyQuote;వికసిత భారత్’ సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ యాత్రలో రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ ప్రజలందరూ పాల్గొనాలని కోరారు&period; కుల&comma; మత&comma; రాజకీయ విభేదాలను పక్కనబెట్టి జాతీయ జెండా కింద ప్రజలంతా ఏకమై తిరంగా యాత్రను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్