జటప్రోలులో యంగ్ ఇండియా స్కూల్ పనుల పరిశీలన.

Advertisements

<p>నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు&period; పెంట్లవెల్లి మండలం జటప్రోలులో నిర్మిస్తున్న పాఠశాల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు&period; నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు&period; నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు&period; ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల పిల్లలకు సమానంగా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందని మంత్రి తెలిపారు&period; పేద&comma; మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు&period; విద్యతో పాటు ఆధునిక వసతులు&comma; ప్రయోగశాలలు&comma; క్రీడా సదుపాయాలతో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఈ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు&period; ప్రతి నియోజకవర్గంలో బాలురు&comma; బాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ విజన్ అని మంత్రి పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్