ఘట్‌కేసర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసుల తనిఖీలు.

Advertisements

<p>మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు&period; పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాపై ఘట్‌కేసర్ పోలీసులు దాడి చేశారు&period; అంబేద్కర్ విగ్రహం సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు&period; ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న అశోక్ లేలాండ్ డోస్ట్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా&period;&period; అందులో సుమారు 38 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు&period; బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు&period; అరెస్టైన వారిని నాగరాజు&comma; చంద్రశేఖర్&comma; తరుణ్‌గా గుర్తించారు&period; ఈ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు&period; వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు&period; ఈ కేసులో పీడీఎస్ బియ్యంతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన అశోక్ లేలాండ్ డోస్ట్ వాహనం&comma; ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా సేకరించినా&comma; రవాణా చేసినా&comma; విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఘట్‌కేసర్ పోలీసులు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్