రైల్వే ప్రాజెక్టులపై మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన.

Advertisements

<p>తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి&comma; పెండింగ్ ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ ఎంపీలు ముందుకు సాగుతున్నారు &period;&period; డిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు&period; ఎంపీలు గడ్డం వంశీకృష్ణ&comma; చామల కిరణ్ కుమార్ రెడ్డి&comma; మల్లు రవి&comma; సురేష్ షెట్కార్ తెలంగాణకు సంబంధించిన పలు రైల్వే అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు&period; ముఖ్యంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తన నియోజకవర్గానికి కీలకమైన రామగుండం–మణుగూరు రైల్వే లైన్ పురోగతిపై ప్రత్యేకంగా చర్చించారు&period; సుమారు 4 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు రామగుండం&comma; పెద్దపల్లి&comma; మంచిర్యాల ప్రాంతాల పారిశ్రామిక&comma; వాణిజ్య&comma; రవాణా అభివృద్ధికి ఎంతో కీలకమని వివరించారు&period; ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి క్షేత్రస్థాయిలో స్పష్టమైన పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు&period; దీనిపై మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందిస్తూ&period;&period; రామగుండం–మణుగూరు రైల్వే లైన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ఇక పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇప్పటికే మంజూరైన రోడ్ ఓవర్ బ్రిడ్జిలు&comma; ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని కూడా ఎంపీ ప్రస్తావించారు&period; నిధుల విడుదల&comma; పనుల అమలులో ఆలస్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు&period; నిర్మాణ ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని&period;&period; పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరారు&period; అలాగే పెద్దపల్లి&comma; రామగుండం&comma; మంచిర్యాల రైల్వే స్టేషన్ల ఆధునీకరణ&comma; అప్‌గ్రేడేషన్ అంశాలపై కూడా మంత్రి&comma; రైల్వే అధికారులతో చర్చించారు&period; తెలంగాణలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేయడం&comma; పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం&comma; ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రంతో నిరంతరం సమన్వయం చేస్తామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్