పటాన్‌చెరు ఎక్సైజ్ స్టేషన్‌ నుంచి హెరాయిన్ నిందితుడు పరారీ.

Advertisements

<p>సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో హెరాయిన్ విక్రయం కేసులో పట్టుబడిన నిందితుడు ఎక్సైజ్ పోలీసుల కస్టడీ నుంచి పరారయ్యాడు&period; పటాన్‌చెరు శివారులో మంగళవారం రాత్రి హెరాయిన్ విక్రయిస్తున్నట్లు గుర్తించిన అబ్కారీ అధికారులు సహిదూర్ రహమాన్‌ను అదుపులోకి తీసుకున్నారు&period; అనంతరం అతడిని పటాన్‌చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి లాక్‌అప్‌లో ఉంచారు&period;<br &sol;>&NewLine;అయితే బుధవారం తెల్లవారుజామున లాక్‌అప్ గిల్స్‌ను విరగొట్టి నిందితుడు పరారైనట్లు అధికారులు గుర్తించారు&period; దీంతో ఎక్సైజ్ సిబ్బంది అప్రమత్తమై అతడి కోసం గాలింపు చేపట్టారు&period; ఘటనపై పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు&period; ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు&period; నిందితుడు ఎలా పరారయ్యాడు&quest; లాక్‌అప్ గిల్స్‌ను ఎలా విరగొట్టాడు&quest; సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా&quest; అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్