కేటీఆర్ విమర్శలకు ఎంపీ చామల కిరణ్ కౌంటర్.

Advertisements

<p>కేసిఆర్ తన కుటుంబం తప్ప తెలంగాణలో ఎవరూ బాగుపడవద్దని భావిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు&period; ఉద్యమ సమయంలో తన కుటుంబం రాజకీయాల్లోకి రాదని చెప్పిన కేసీఆర్&period;&period; 1600 మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో తన కుటుంబంలోనే ఐదు పదవులు ఇచ్చుకున్నారని విమర్శించారు&period; కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి నేరుగా మంత్రి అయ్యారని&comma; హరీష్ రావు ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయ్యారని గుర్తుచేశారు&period; కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఐదుగురు సోదరులకు ఎలాంటి పదవులు ఇచ్చుకోలేదని&comma; అందరిలాగే దరఖాస్తు చేసుకుంటేనే ఆయన సోదరునికి భూమి కేటాయించారని స్పష్టం చేశారు&period; కాళేశ్వరంలో దండుకోవాలన్న ఆలోచనతోనే బీఆర్‌ఎస్ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పట్టించుకోలేదని&comma; ఆ పార్టీకి దీనిపై మాట్లాడే అర్హతే లేదన్నారు&period; కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు తన దోస్తుల కంపెనీలకు ఏ విధంగా భూములు కట్టబెట్టారో తమకు అన్నీ తెలుసని&comma; కుటుంబంలో పంపకాలు తేడా రావడం వల్లే కవిత కొత్త పార్టీ పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు&period; ఇప్పటికైనా కేటీఆర్ తన పిచ్చి మాటలు బంద్ చేయాలని ఎంపీ చామల కిరణ్ రెడ్డి హితవు పలికారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్