తెలంగాణలో ఆగస్టు 27న ఓటరు రోల్ సభలు.

Advertisements

<p>తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ&period;&period; ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 27à°¨ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు రోల్ సభలు నిర్వహించనున్నారు&period; గ్రామ&comma; వార్డు సభల రూపంలో జరిగే ఈ కార్యక్రమాల్లో బూత్ స్థాయి అధికారులు ముసాయిదా ఓటరు జాబితాను బహిరంగంగా చదివి వినిపించనున్నారు&period; అర్హులైన ఓటర్లు ఎవరైనా జాబితాలో లేకపోతే గుర్తించడంతో పాటు&period;&period; పేర్లు&comma; చిరునామాలు&comma; ఇతర వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం కల్పించనున్నారు&period; అక్టోబర్ 1&comma; 2026 నాటికి 18 ఏళ్లు నిండే యువత ఫామ్-6 ద్వారా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చు&period; వివరాల్లో తప్పులు ఉన్నవారు ఫామ్-8 ద్వారా సవరణలకు దరఖాస్తు చేసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నందున రాష్ట్రవ్యాప్తంగా సుమారు 92&period;87 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు&period; ఒకే పేరు రెండు చోట్ల ఉండటం&comma; కుటుంబ సభ్యుల వయసుల్లో వ్యత్యాసాలు&comma; తండ్రి పేరు వంటి వివరాల్లో తప్పులు ఉండటం వంటి అంశాలపై ఈ నోటీసులు ఇస్తున్నారు&period; నోటీసులు అందుకున్న వారు విచారణ సమయంలో ఎన్యుమరేషన్ ఫారంతో పాటు అవసరమైన గుర్తింపు&comma; నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది&period; క్లెయిమ్‌లు&comma; అభ్యంతరాలను సెప్టెంబర్ 16 వరకు దాఖలు చేయవచ్చు&period; విచారణ ప్రక్రియ అక్టోబర్ 15 వరకు కొనసాగనుండగా&period;&period; అక్టోబర్ 19à°¨ తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు&period; తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు 27à°¨ జరిగే ఓటరు రోల్ సభలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.