డీజీపీ సీవీ ఆనంద్ ఎదుట లొంగిపోయిన పసునూరి నరహరి..

డీజీపీ సీవీ ఆనంద్ ఎదుట లొంగిపోయిన పసునూరి నరహరి

Advertisements

<p>మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి&period;&period; తన భార్య దానమ్మతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు&period; ఈమేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు&period; నరహరి లొంగుబాటుతో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలిందని డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు&period; పసునూరి నరహరి స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి అని&comma; డిగ్రీ చదువుతున్న సమయంలో మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లిపోయారన్నారు&period; 1982లో అజ్ఞాత దళ సభ్యుడిగా పసునూరి నరహరి చేరారన్నారు&period; 2017లో కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారని&comma; తుపాకులు&comma; మోర్టార్లు&comma; రాకెట్లు&comma; గ్రనేడ్ల తయారీలో ఆయన నిపుణుడని డీజీపీ వివరించారు&period; సాంకేతిక&comma; సంస్థాగత బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తిస్తూనే&period;&period; ఆయుధాల ఉత్పత్తి&comma; మరమ్మతు&comma; నిర్వహణకు సంబంధించి మావోయిస్టు కార్యకర్తలకు నరహరి శిక్షణ ఇచ్చేవారని తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>మావోయిస్టు కార్యకలాపాలను నిర్మూలించేందుకు కేంద్ర&comma; రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని డీజీపీ సీవీ ఆనంద్‌ చెప్పారు&period; అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని సూచించారు&period; తెలంగాణకు చెందిన ముగ్గురు నేతలు&period;&period; గణపతి&comma; జాడే సుజాత&comma; వార్త శేఖర్‌ మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని&comma; లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం సాయమందిస్తోందని డీజీపీ తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.

గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.