తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం..

తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం

Advertisements

<p>ఇక ఇటు తెలంగాణలోనూ వాతావరణం మారిపోయింది&period; హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులు&comma; ఉరుములు&comma; మెరుపులతో కూడిన వర్షం పడింది&period; జగిత్యాల జిల్లాలో మెట్‌పల్లి&comma; ఇబ్రహీంపట్నం&comma; మల్లాపూర్&comma; కోరుట్ల మండలాల్లో ఉరుములు&comma; మెరుపులతో కూడిన వర్షం కురిసింది&period; ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్ గ్రామంలోని మహాలక్ష్మి ఆలయం వెనుక ఉన్న తాటి చెట్టుపై పిడుగు పడింది&period; దీంతో చెట్టుకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు&period; ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది&period; అయితే గత కొన్ని రోజులుగా తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది&period; వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇక మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని జడ్చర్ల&comma; రాజాపూర్&comma; బాలానగర్&comma; మిడ్జిల్ మండలాల్లో ఒక్కసారిగా భారీ వర్షం ప్రారంభమైంది&period; ఉరుములు&comma; మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులు వీచడంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి&period;రోడ్లపై చెట్లు విరిగిపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు&period; కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి నుండి భారీ వర్షం కురుస్తోంది&period; లింగంపల్లి&comma; గచ్చిబౌలి&comma; కుత్బుల్లాపూర్&comma; మియాపూర్&comma; మాదాపూర్ చందానగర్ తదితర ప్రాంతాలలో భారీగా జల్లులు పడుతున్నాయి&period; దీంతో రోడ్లన్ని జలమయ్యాయి&period; తీవ్రమైన ఎండలతో తల్లడిల్లిపోయిన ప్రజలకు&period;&period; ఈ భారీ జల్లులు కొంత మేర ఉపశమనం కలిగించాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..