తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.

Advertisements

<p>తెలంగాణను ప్రపంచ పెట్టుబడులు&comma; వ్యవసాయ వాణిజ్యం&comma; పారిశ్రామిక అవకాశాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో 2026 డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు హాజరుకావాలని ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి&period;టియు లారెల్ జూనియర్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆహ్వానించారు&period; న్యూఢిల్లీలో ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శితో మంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు&period; తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత&comma; ఉత్పాదక సామర్థ్యం&comma; ఎగుమతి అవకాశాలను వివరించారు&period;<&sol;p>&NewLine;<p>తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌ లక్ష్యాలు&comma; రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను మంత్రి ఉత్తమ్‌ వివరించారు&period; తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులను భారీగా పెంచడం&comma; ఇరు ప్రాంతాల మధ్య వ్యవసాయ వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించడం&comma; దీర్ఘకాలిక వాణిజ్య భాగస్వామ్యాన్ని నెలకొల్పడంపై ఇరువురు విస్తృతంగా చర్చించారు&period;<&sol;p>&NewLine;<p>తెలంగాణ నుంచి పెద్ద పరిమాణంలో బియ్యాన్ని కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి ఉత్తమ్‌ తెలిపారు&period; తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న నాణ్యమైన మాంస ఉత్పత్తులు&comma; అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన విత్తనాల కొనుగోలుపైనా ఫిలిప్పీన్స్‌ ఆసక్తి వ్యక్తం చేసిందని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.