రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ -మంత్రి పొంగులేటి..

ఫ్యూచర్ సిటీ పనులు పరిశీలించిన పొంగులేటి, శ్రీధర్‌బాబు

Advertisements

<p>రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపడతామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు&period; ఇప్పటికే సుమారు లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయిందని చెప్పారు&period; జూన్‌ చివరి నాటికి మరో లక్ష పూర్తవుతాయన్నారు&period; జీహెచ్‌ఎంసీ పరిధిలో 18వేల ఇళ్లు మంజూరు చేశామని మంత్రి వివరించారు&period; తొలిదశలో హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని&comma; దీనికి అవసరమైన కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లామన్నారు&period; 13 చోట్ల స్థలాలు పరిశీలించామని మంత్రి తెలిపారు&period; జీహెచ్ఎంసీలో స్థలం కొరతతో 18వేల ఇళ్లే ఇచ్చామని&comma; పేదల ఇళ్ల కోసం విలువైన ప్రభుత్వ భూములను కేటాయిస్తున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు&period; జీవనోపాధికి అనుగుణంగా ఉండే ప్రాంతాల్లో&comma; నివాసయోగ్యమైన ప్రదేశాల్లో ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు&period; జీహెచ్ఎంసీ ప్రాంతంలో తమ ప్రభుత్వం బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని&comma; చెప్పినట్లు తాము ఎక్కువ ఇండ్లు కట్టి చూపిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు కేటీఆర్ సిద్ధమా అని మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అన్నమయ్య జిల్లా అరవీడులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీ..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..

గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు..