కొండా సురేఖకు బుజ్జగింపులు.

Advertisements

<p>తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్&comma; మాజీ మంత్రి కొండా సురేఖకు ఫోన్ చేసి మాట్లాడారు&period; ఇటీవల పార్టీలో&comma; రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై మీనాక్షి నటరాజన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది&period; అంతర్గత విభేదాలు&comma; వ్యక్తిగత కారణాలను పక్కనపెట్టి పార్టీ కార్యక్రమాల్లో తిరిగి క్రీయాశీలకంగా మారాలని కొండా సురేఖకు ఈ సందర్భంగా ఆమె సూచించారు&period; ప్రస్తుతం తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో కొండా సురేఖ సభకు గైర్హాజరు కావడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది&period; ఈ తరుణంలో కాంగ్రెస్ రాష్ట్ర ఇంఛార్జి నేరుగా ఫోన్ చేసి మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది&period; పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సూచనలు రావడంతో&comma; రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు కొండా సురేఖ హాజరవుతారా లేదా అన్న అంశంపై కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది&period; కాగా&comma; ఇటీవలే తెలంగాణ మంత్రి మండలి నుంచి కొండా సురేఖ బర్తరఫ్‌ అయ్యారు&period; కేబినెట్‌ నుంచి కొండా సురేఖను తొలగించాలని సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన సిఫార్సును గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ఆమోదించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.