ఆర్మీ వెపన్స్‌ చోరీ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌.

Advertisements

<p>బొల్లారం మిలటరీ కంపౌండ్ మద్రాసు రెజిమెంట్ యూనిట్ నుంచి మిస్సింగ్ అయిన గన్స్ చోరీ వెనకాల 12 ఏళ్ల పాటు మిలటరీలో పని చేసి బయటికి వచ్చిన ఓ ఉద్యోగి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది&period; ఈ కేసు మిస్టరీని చేధించేందుకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్‌తో పాటు దేశంలోని అన్ని దర్యాప్తు ఏజెన్సీలు ఒక టీంగా పని చేశారు&period; దీనికి హైదరాబాద్ నగరం చుట్టూ 20 కిలో మీటర్ల వరకు జల్లెడ పట్టారు&period; కొన్ని వందల మందిని ఫాలో అయ్యారు&period; చివరకు లభించిన ఓ చిన్న క్లూతో తీగ లాగితే మొత్తం డొంక కదిలిందని సమాచారం&period;<&sol;p>&NewLine;<p>అయితే ఈ మిస్సింగ్ గన్స్ వెనకాల పెద్ద కుట్ర ఉండొచ్చని అనుమానాలు ఉన్నప్పటికీ వాటిని నిర్ధారించుకునేందుకు ఇంకా అనేక ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది&period; హంటింగ్ కోసం ఈ తుపాకులను చోరీ చేసినట్లుగా పోలీసుల అదుపులో ఉన్న అనుమానితులు సమాధానం ఇచ్చి దర్యాప్తు దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది&period; అయితే ఈ మిస్సింగ్ మిలటరీ గన్స్ వెనకాల హానిట్రాప్&comma; కోట్లాది డబ్బు లావాదేవీలు&comma; ఉగ్ర ప్లాన్ వంటి కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు&period; ఇంకా అనేక ట్విస్టులు వెలుగులోకి రానున్నాయని పోలీసులు అధికారులు వివరిస్తున్నారు&period; మిస్సింగ్ అయిన తుపాకులు అన్ని దొరకడంతో ఓ పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు&comma; మిలటరీ అధికారులు ఊపీరి పీల్చుకుంటున్నారు&period; మిలటరీ క్యాంపులోని అత్యంత భద్రత వలయం నుంచి ఈ తుపాకులు బయటికి రావడంపై అక్కడ నెలకొన్న లోపాలపై కూడా పోలీసులు ఓ నివేదికను రూపొందించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.

కొండా సురేఖకు బుజ్జగింపులు.

ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.