కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం.

కొండమల్లేపల్లి–నాంపల్లి ప్రధాన రహదారి దుస్థితిపై ప్రజల ఆగ్రహం

Advertisements

<p>నల్గొండ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు&period; కొండమల్లేపల్లి నుంచి నాంపల్లి వెళ్లే ప్రధాన రహదారి గత ఏడాదిన్నరగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది&period; గుంతలతో నిండిన ఈ రోడ్డు వాహనదారులకు నిత్యం ప్రమాదకరంగా మారింది&period; దుమ్ము&comma; ధూళితో కప్పుకుపోయిన ఈ మార్గంలో ప్రయాణం చేయడం అంటే ప్రాణాలతో చెలగాటమేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; ఇప్పటికే అనేక మంది చిన్నచిన్న ప్రమాదాల్లో గాయపడి ఆసుపత్రుల పాలయ్యారని చెబుతున్నారు&period; అంబులెన్స్‌లు కూడా వేగంగా వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో అత్యవసర వైద్యం అందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి&period; రోడ్డు పక్కన నివసించే ప్రజలు దుమ్ము కారణంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు&period; చిన్నారులు&comma; వృద్ధులు దగ్గు&comma; ఆయాసంతో ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు&period; అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన లేకపోవడం స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతుంది<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p>ఇదే రహదారి పక్కన ఉన్న రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు&period; పొలాలపై ఎగసిపడుతున్న దుమ్ము కారణంగా పంటలపై బూడిద పేరుకుపోయి దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు&period; లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినా ఒక్క గింజ కూడా చేతికి రాకుండా పంటలు నాశనం అవుతున్నాయని వారు చెబుతున్నారు&period; వాహనాల రాకపోకలతో దుమ్ము మరింత పెరిగి వ్యవసాయ భూములు బీడుబారినట్లు మారుతున్నాయని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు&period; అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; పరిస్థితి ఇలాగే కొనసాగితే రోడ్డుపై రాస్తారోకో చేసి పెద్ద ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు&period; వెంటనే కొత్త బీటీ రోడ్డు నిర్మించి ప్రజలకు&comma; రైతులకు ఉపశమనం కలిగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు&period; లేకపోతే గ్రామంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.