HICC వేదికగా తెలంగాణ ప్రగతి గళం..

HICC వేదికగా తెలంగాణ ప్రగతి గళం

Advertisements

<p>హైదరాబాద్‌ మహానగరం మరో అద్భుత ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది&period; ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ లో పర్యటించారు&period; బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మోడీ &&num;8230&semi; అక్కడి నుంచి నేరుగా హెచ్ఐసీసీ ప్రాంగణానికి చేరుకున్నారు&period; అక్కడ నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ à°¶à°¿à°µ ప్రతాప్ శుక్లా&comma; సీఎం రేవంత్ రెడ్డి&comma; కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి&comma; బండి సంజయ్ పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా హెచ్ఐసీసీలో ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి సత్కరించారు&period; ప్రధానికి రేవంత్ రెడ్డి వెండి నంది విగ్రహాన్ని బహుకరించారు&period; ఈ కార్యక్రమంలో భాగంగా 9 వేల 377 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను మోడీ వర్చువల్ గా ప్రారంభించారు&period;<br &sol;>&NewLine;గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు&period; రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం సుమారు 12 లక్షల కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించిందని ఆయన గణాంకాలతో సహా వెల్లడించారు&period; 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ&comma; నేషనల్ హైవేల విస్తరణ మరియు మూతపడిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించడం వంటివి కేంద్రం సాధించిన విజయాలని ఆయన స్పష్టం చేశారు&period; రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రగతికి తాము కట్టుబడి ఉన్నామని కిషన్ రెడ్డి తెలిపారు&period;<br &sol;>&NewLine;రాష్ట్రాన్ని 2047 నాటికి అగ్రగామిగా నిలబెట్టే &&num;8216&semi;తెలంగాణ రైజింగ్-2047&&num;8217&semi; మాస్టర్ ప్లాన్ గురించి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు&period; అభివృద్ధిలో తాము కేంద్రంతో కలిసి నడిచేందుకు సిద్ధమని స్పష్టం చేస్తూనే&period;&period; మెట్రో రైలు రెండో దశ&comma; రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ మరియు మూసీ నది ప్రక్షాళన వంటి ప్రాజెక్టులకు కేంద్రం పెద్ద మనసుతో నిధులు అందించాలని కోరారు&period; ఒకవైపు పాతబస్తీ మెట్రో&comma; మరోవైపు ఫ్యూచర్ సిటీ నిర్మాణం&period;&period; ఇవే తమ ప్రభుత్వ లక్ష్యాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..