67
కార్తీక మాస పర్వదినాలు ప్రారంభం కావడంతో మొదటి రోజైన మంగళవారం కార్తీక మాసం శోభ సంతరించుకుంది.. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ, ఘంటసాల ,మోపిదేవి, చల్లపల్లి మండలాలలోని వేకు జాము నుంచే అదిక సంఖ్యలోమహిళలు కృష్ణా నదిలో ప్రత్యేక పుణ్య స్థానాలు ఆచరించి నదీ తీరాన ఉన్నటువంటి శివాలయాలలో ప్రత్యేక పూజలు చేసి శివుని దర్శించుకున్నారు.. నాగాయలంక శ్రీ రామ పాదక్షేత్రం పుష్కర ఘాట్లో కార్తీక మాసం మొదటి రోజు సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పవిత్ర స్నానం ఆచరించి నది ఒడ్డునఉన్న రామలింగేశ్వర స్వామిని అభిషేకించారు. కార్తీకదీపం వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.