70
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని జిల్లెలగడ్డ గ్రామ శివారులలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతుండగా హానుమకొండ నుండి సిద్దిపేటకు వెళుతున్న సిద్దిపేట డిపో TS 36 T 7817 నెంబర్ గల బస్సు డ్రైవర్, గ్రానైట్ వెహికిల్ ని ఓవర్ టేక్ చేస్తూ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పొలంలోకి పడబోయింది. అందులో దాదాపు 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అందులో కొంతమందికి స్వల్ప గాయాలు కాగా మిగతావారు సురక్షితంగా బయటపడ్డారు. దీనికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ ప్రయాణికులు చెప్పుకొచ్చారు ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు తెలిపారు.