కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల చివరి జాబితా విడుదల అయింది. టికెట్ రాని వారు తమ అసంతృప్తిని తెలుపుతున్నారు. సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో పటేల్ రమేష్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు భోరున ఏడ్చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డిని గెలిపించేందుకు నాకు టికెట్ ఇవ్వలేదని పటేల్ రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సూర్యాపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఖరారు చేస్తు నిర్ణయం తీసుకుంది. దీంతో టికెట్ ఆశించి భంగపడిన రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా రెండవసారి టికెట్ ఆశించి భంగపడటంతో పటేల్ రమేష్, ఆయన సతీమణి లావణ్య రెడ్డి బోరున విలపించారు. పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల చివరి జాబితా విడుదల..
60