సంగారెడ్డి రిటర్నింగ్ కార్యాలయం ముందు బీజేపీ నేత రాజేశ్వర్ రావు దేశ్ పాండే నిరసనకు దిగారు. శుక్రవారం విడుదలైన బీజేపీ అభ్యర్థుల చివరి జాబితాలో సంగారెడ్డి నుంచి రాజేశ్వర్ రావు దేశ్ పాండేకు బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. అయితే టికెట్ ఇచ్చినప్పటికీ బీ ఫామ్ ఇవ్వకపోవడంతో దేశ్ పాండే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి మరీ వెక్కి వెక్కి ఏడ్చారు. తనకు బీ ఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బీజేపీ నేత హెచ్చరించారు.
Ticket
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల చివరి జాబితా విడుదల అయింది. టికెట్ రాని వారు తమ అసంతృప్తిని తెలుపుతున్నారు. సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో పటేల్ రమేష్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు భోరున ఏడ్చేశారు. మంత్రి జగదీశ్ రెడ్డిని గెలిపించేందుకు నాకు టికెట్ ఇవ్వలేదని పటేల్ రమేష్ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సూర్యాపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఖరారు చేస్తు నిర్ణయం తీసుకుంది. దీంతో టికెట్ ఆశించి భంగపడిన రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా రెండవసారి టికెట్ ఆశించి భంగపడటంతో పటేల్ రమేష్, ఆయన సతీమణి లావణ్య రెడ్డి బోరున విలపించారు. పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేసింది.
నగాం నియోజకవర్గం కాంగ్రెస్స్ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ వేయటం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర కేంద్ర నాయకులకి ధన్యవాదాలు. ఎలాంటి అక్రమాలకు భూ కబ్జాలు చేయకుండ నిజాయితిగా నియోజక వర్గ అభివృద్ధి కోసం పనిచేస్తా జనగామ నియోజక వర్గ ప్రజలు నాకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా పది సంవత్సారాల పరిపాలనలో చేసింది ఎం లేదు కెసీఆర్ ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చారు ముత్తి రెడ్డి యాదగిరి చెప్పిండు కెసిఅర్ అడిగినంత అమౌంటు నేను ఇవ్వలేకపోయా నాకన్నా ఎక్కువ అమౌంటు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇచిండు కనకే టికెట్ ఇవ్వడం జరిగింది అన్నారు గతంలో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పరిపాలనలో మొత్తం భూకబ్జాలు అక్రమాలు, అవినీతులు ఇప్పుడు కూడా పళ్ల అంతకంటే ఎక్కువ కబ్జాలు అక్రమాలు చేసి ముత్తిరెడ్డి కన్నా ఎక్కువ అమౌంట్ కేసిఆర్ కు ఇవ్వాలి అనే ఒప్పందంతోనే పల్లాకి టికెట్ ఇచ్చారు కెసిఅర్ పాలనలో అన్ని రకాల అరాచకాలు పరిపాలన అస్తవ్యస్థంగా దుర్మార్గుడి పరిపాలనలో తెలంగాణ ఉన్నదీ ఇదే నెలలో దీపావళి ఉన్నదీ కానీ నిజమైన దీపావళి వచ్చే నెల వస్తుంది కెసిఅర్ అనే నరకాసురుడు దుర్మార్గుడు పోయి కాంగ్రెస్స్ ఇందిరమ్మ పాలన వస్తుంది ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉంటారు నిజమైన దీపావళి మూడు తారీకు సాయంత్రం చేసుకుందాం అన్నారు.
Read Also..
Read Also..
నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయింపు పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఆ పార్టీ తరపున టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బత్తుల లక్ష్మారెడ్డి బి ఎల్ ఆర్ ఈరోజు తన నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తుంగ పహాడ్ గ్రామం వద్ద నుండి వేలాది మంది కార్యకర్తలు అభిమానులు వెంటరాగా భారీ ర్యాలీగా బయలుదేరిన బిఎల్ అర్ మిర్యాలగూడ ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ దాఖలు చేశానని. టికెట్ కేటాయింపు విషయం అధిష్టానం చూసుకుంటున్నది చెప్పారు. అధికార పార్టీ ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులం అందరం సమన్వయంతో కలిసి పనిచేసి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామన్నారు. రాజకీయాల్లోకి రాకముందే ప్రజాసేవలో ఉన్నానని అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మిర్యాలగూడ అభివృద్ధికి అంకితమై పని చేస్తానన్నారు.




Total views : 150043