ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం.. భారత రాజ్యాంగం – రోశయ్య

Dr.B.R.Ambedkar

Advertisements

&NewLine;<p>భారతరత్న&comma; ప్రపంచ మేధావి డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపిస్తున్న రాజ్యాంగం భారత రాజ్యాంగం అని పొన్నూరు ఎమ్మెల్యే&comma; వైయస్సార్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కిలారి వెంకట రోశయ్య అన్నారు&period; గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఐలాండ్ సెంటర్లో రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా శనివారం డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ&period;&period; భారతదేశానికి సర్వసత్తాక&comma; ప్రజాస్వామ్య&comma; గణతంత్ర ప్రతిపత్తిని అందించిన ఘనత డాక్టర్ బి&period;ఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని మన రాజ్యాంగానిదే అన్నారు&period; వివిధ కులాల&comma; మతాల&comma; సంస్కృతుల&comma; ప్రాంతాల భారతీయులు శాంతియుతంగా జీవిస్తున్నారంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలమే అన్నారు&period; ఆ మహానీయుడు అంబేద్కర్ అడుగుజాడల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ&comma; ఎస్టీ&comma; బీసీ&comma; మైనారిటీ&comma; అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి భవిష్యత్తు మెరుగుపడేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు&period; పొన్నూరు పట్టణంలోని ప్రధాన కూడలి అయిన ఈ ఐలాండ్ సెంటర్ ప్రాంతం నేటి నుండి అంబేద్కర్ సెంటర్ గా నామకరణం చేస్తూ తీర్మానం చేశామని&comma; ఇకనుంచి దీన్ని అందరూ అంబేద్కర్ సెంటర్ గా వ్యవహరించాలని సూచించారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య అందరికీ రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్