హరీశ్‌రావు అలా చెప్పిన మరుక్షణం జైలులో – రేవంత్‌రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని&comma; తమ అభిప్రాయాలను ఎవరైనా స్వేచ్ఛగా చెప్పొచ్చని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి మరోమారు స్పష్టం చేశారు&period; బీఆర్ఎస్ పార్టీలో అలాంటి ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించదని&comma; తాను సీఎం అవుతానని హరీశ్‌రావుకు చెప్పే ధైర్యం లేదని&comma; అలా చెప్పిన మరుక్షణం ఆయన జైలులో ఉంటారని చెప్పారు&period; నిర్వహించిన &OpenCurlyQuote;క్వశ్చన్ అవర్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు&period; కాంగ్రెస్ తరచూ సీఎంలను మార్చుతుందన్న అపవాదుపై రేవంత్ స్పందిస్తూ&period;&period; హిమాచల్ ప్రదేశ్&comma; చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని&comma; అక్కడ సీఎంలు మారారా&quest; అని ప్రశ్నించారు&period; బీఆర్ఎస్‌లో ఉంటేనే ఉద్యమకారుడు&period;&period; లేదంటే తెలంగాణ ద్రోహి అనడం ఫ్యాషన్ అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; తాము ఉద్యమకారులకు సీట్లు ఇస్తే&period;&period; వేలకోట్లు ఉన్న వారికి బీఆర్ఎస్ రాజ్యసభ సీట్లు ఇచ్చిందని విమర్శించారు&period; ఎస్టీ&comma; ఎస్టీ&comma; బీసీ&comma; మైనార్టీలకు తాము 60 శాతం సీట్లు ఇచ్చామన్నారు&period; తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లికి ఓడిపోయే సీటు ఇచ్చారన్నారు&period; మొన్నటి వరకు కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరని ప్రచారం చేశారని&comma; ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు&period; ధరణిపై తొలి నుంచి తీవ్ర ఆరోపణలు చేస్తున్న రేవంత్&period;&period; అంతర్జాతీయ నేరగాళ్లు ఉండే దేశాల నుంచి ధరణి పనిచేస్తోందని ఆరోపించారు&period; రెవెన్యూ రికార్డులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు&period; వాటిని వారికి ఇచ్చే అధికారం కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు&period; హైదరాబాద్‌లోని కొందరు ధరణి వచ్చాక వందల ఎకరాలకు ఆసాములయ్యారని తెలిపారు&period; ఊళ్లలోని భూములను ఎప్పుడో అమ్మేసుకున్న వారి పేర్లు ఇప్పుడు రికార్డుల్లోకి ఎలా వచ్చాయని రేవంత్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.