పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇది ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ నేడు తుఫాన్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉందని తెలిపారు. ఒకవేళ ఇది తుఫాన్‌గా మారితే ‘మిధిలి’గా నామకరణం చేయనున్నారు. ఈ నెల 18న తెల్లవారుజామున బంగ్లాదేశ్ సమీపంలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణశాఖ తెలిపింది. దీంతోపాటు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 28 తర్వాత రాష్ట్రంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాబోయే మూడు రోజులు వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి. ఉత్తర కోస్తా, యానాంలో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటున్నారు. దక్షిణ కోస్తాలో ఇవాళ, రేపు భారీ వర్షాలు పడతాయంటున్నారు. రాయలసీమలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంటుందని తెలిపారు.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం
63
previous post