టీమిండియాకు త్రీవ నిరాశ..!

Team India

Advertisements

&NewLine;<p>భారత గడ్డపై జరిగిన వరల్డ్ కప్ ను పాట్ కమిన్స్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఎగరేసుకెళ్లింది&period; అలా ఇలా కాదు టోర్నీలో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి&comma; ఆ తర్వాత వరుస విజయాలు సాధించి&comma; ఆఫ్ఘన్ వంటి జట్టుపై అద్భుత రీతిలో పోరాడి&comma; సెమీస్ లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి ఫైనల్ చేరిన ఆసీస్ జట్టు ఫైనల్లో ఆతిథ్య టీమిండియాను ఓడించి సగర్వంగా వరల్డ్ కప్ ను ఒడిసిపట్టింది&period; అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కంగారూలు ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరిచి 6 వికెట్లతో తేడాతో ఘనవిజయం సాధించారు&period; తొలుత టీమిండియాను 240 పరుగులకు పరిమితం చేసిన ఆస్ట్రేలియన్లు 241 పరుగుల లక్ష్యాన్ని 43 ఓవర్లలో 4 వికెట్లకు ఛేదించారు&period; తద్వారా రికార్డు స్థాయిలో 6వ ప్రపంచకప్ టైటిల్ ను సాధించారు&period; ఆసీస్ విజయంలో బౌలర్లు&comma; ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రధాన పాత్ర పోషించారు&period; బౌలర్లు స్టార్క్&comma; హేజెల్ వుడ్ కెప్టెన్ కమిన్స్ విశేషంగా రాణించి టీమిండియాను 240 పరుగులకు ఆలౌట్ చేయగా 241 పరుగుల లక్ష్యఛేదనలో ట్రావిస్ హెడ్ చిరస్మరణీయ సెంచరీతో అదరగొట్టాడు&period; హెడ్ కు లబుషేన్ తోడవడంతో ఆ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు టీమిండియా విఫలయత్నాలు చేసింది&period; కానీ కొరకరానికొయ్యల్లా మారిన ఈ ఇద్దరు బ్యాటర్లు ఆతిథ్య జట్టుకు విజయాన్ని దూరం చేశారు&period; హెడ్ 137 పరుగులు చేయగా&comma; లబుషేన్ 58 పరుగులతోనూ అజేయంగా నిలిచారు&period; హెడ్ 120 బంతులాడి 15 ఫోర్లు&comma; 4 సిక్సులు కొట్టాడు&period; టీమిండియా బౌలర్లలో బుమ్రా 2&comma; షమీ 1&comma; సిరాజ్ 1 వికెట్ తీశారు&period; 2003 వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన పరాభవానికి టీమిండియా నేడు ప్రతీకారం తీర్చుకుంటుందని అందరూ భావిస్తే ఆస్ట్రేలియా జట్టు తాను అంచనాలకు అందే జట్టును కాదంటూ వరల్డ్ కప్-2023 విజేతగా నిలిచింది&period; ఆస్ట్రేలియా గతంలో 1987&comma; 1999&comma; 2003&comma; 2015లోనూ వన్డే వరల్డ్ కప్ టైటిళ్లు నెగ్గింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.