129
చేవెళ్ల మండలంలో పులి సంచారం చేస్తుండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. రంగారెడ్ది జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని ఊరెల్లా మొండి వాగు మరియు కొత్తపల్లి పరిసర ప్రాంతాలలో పులి సంచరించడాన్ని అయ్యప్ప స్వాములు చూశారు. దీంతో పులి అడుగులను పరిశీలించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ముడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రతిమకు గ్రామాల్లో పులి తిరుగుతున్నట్లు తెలిపారు. గత నెలలో వికారాబాద్ అనంతగిరి అడవుల్లో సంచరించిన పులి…ఇక్కడ కూడా తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పులిని పట్టుకుంటామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.