నేడు తమిళనాడు, బెంగాల్‍లో ఎన్నికల పోలింగ్ ..

Advertisements

<p>దేశ వ్యాప్తంగా ఒక కేంద్ర పాలిత ప్రాంతం&comma; నాలుగు రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన తమిళనాడులోని 234 స్థానాలతో పాటు పశ్చిమ బంగాల్ లోని 152 స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది&period; ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది&period; ఇప్పటికే తమిళనాడుతో పాటు పశ్చిమ బంగాల్ ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు&period; ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసింది&period; ఇక నాయకులు కూడా హోరా హోరీగా ప్రచారం చేశారు&period;ఎన్నికల నియమావళి ప్రకారం మొన్నటి సాయంత్రంతో మైకులు మూగబోయాయి&period; ఓటర్లు నేడు తమకు కాబోయే నాయకుడు ఎవరనేది తమ ఓటుతో డిసైడ్ చేయనున్నారు&period;<&sol;p>&NewLine;<p>తమిళనాడులో అన్నాడీఎంకే&comma; బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి&comma; డీఎంకే&comma; కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి&comma; విజయ్ కు సంబంధించిన టీవీకే పోటాపోటీగా ప్రచారం చేశారు&period; తమిళనాడులోని అన్ని స్థానాలకు ఒక్క విడతతోనే పోలింగ్ జరగనుంది&period; డీఎంకే ఈ ఎన్నికల్లో 164 చోట్ల బరిలో దిగింది&period; మిగిలిన స్థానాలను తమ మిత్రపక్షాలకు కేటాయించింది&period; ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే 169 స్థానాల్లో తన అభ్యర్ధులను నిలబెట్టింది&period; విజయ్ కు చెందిన తమిళ వెట్రి కళగం 234 స్థానాల్లో బరిలో దిగింది&period; మొత్తంగా 234 స్థానాలకు 4023 మంది బరిలో ఉన్నారు&period; మొత్తంగా 5&comma;73&comma;43&comma; 291 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇక దేశంలోని తూర్పున ఉన్న పశ్చిమబెంగాల్ లో రెండు విడతల్లో ఎన్నికల్లో జరగనున్నాయి&period; మమత నేతృత్వంలోని టీఎంసీ&comma; భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ&comma; అమిత్ షా&comma; యోగి ఆదిత్యనాథ్&comma; హిమంత బిశ్వశర్మ సహా పలువువు కీలక బీజేపీ నేతలు ఎన్నికల్లో తమకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ సుడిగాలి పర్యటనలు చేశారు&period; ఇక ఎన్నికల సర్వేలో టీఎంసీ&comma; బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది&period; ఇక పశ్చిమ బంగాల్ తొలి విడత ఎన్నికల్లో దాదాపు 3 కోట్ల 60 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.