విజయ్ కేబినెట్‌లో యువ మహిళా మంత్రిగా కీర్తన సంపత్..

విజయ్ కేబినెట్‌లో యువ మహిళా మంత్రిగా కీర్తన సంపత్

Advertisements

<p>తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కొలువు తీరింది&period; విజయ్ కేబినెట్ లో ఏకైక&period;&period; యువ మహిళా మంత్రిగా కీర్తన సంపత్ ప్రమాణ స్వీకారం చేసారు&period; తన పార్టీ నుంచి ఎంతో మంది సామాన్యుల ను అసెంబ్లీకి పంపిన విజయ్&period;&period; కీర్తన విషయంలోనూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు&period; 29 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెడుతున్న కీర్తన సంపత్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు&period; ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువతి కీర్తన సంపత్&period; కీర్తనది విరుద్ నగర్ జిల్లా చత్రరెడ్డియపట్టి&period; అక్కడే ఆమె డిగ్రీ వరకు చదువుకుంది&period; పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేసింది&period;ఆ తర్వాత డేటా అనలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు&period; ప్రశాంత్ కిశోర్ బృందంలో చేరారు&period; గోవా&comma; పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎన్నికల్లో తెరవెనుక వ్యూహరచనలో కీలక పాత్ర పోషించారు&period;<&sol;p>&NewLine;<p>హైదరాబాద్ కేంద్రంగా టీడీపీ సోషల్ మీడియా విభాగానికి ఆమె నాయకత్వం వహించారు&period; టీడీపి సోషల్ మీడియా లీడ్‌గా పనిచేసి తన పొలిటికల్ కన్సల్టెంట్‌కు ముగింపు పలికారు&period; ఈ క్రమంలోనే ఆమెకు తెలుగు భాషపై మంచి పట్టు లభించింది&period; అందుకే శివకాశిలో తెలుగులో ప్రసంగించి మరీ తెలుగు ఓటర్లను విశేషంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు&period; దేశవ్యాప్తంగా ఎందరో నేతల గెలుపు కోసం వ్యూహాలు రచించిన కీర్తనా సంపత్ తన సొంత జిల్లాలోని ప్రజలను ఆకట్టుకొని కొత్త వ్యూహం అమలు చేసారు&period; వ్యూహకర్తగా పనిచేసిన ఎక్స్‌పీరియన్స్‌తో ఆమె సోషల్ మీడియాను తన ప్రధాన అస్త్రంగా వాడుకున్నారు&period; కీర్తనా సంపత్ సర్వీస్ గురించి తెలుసుకున్న పలు సంస్థలు సైతం ఆమెతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చాయి&period; శివకాశి నియోజకవర్గంలో అత్యధికంగా ఉండే తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగులో ప్రసంగించి అందర్నీ ఆకట్టుకున్నారు&period; ఇతర రాజకీయ పార్టీల కంటే వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి సక్సెస్ అయ్యారు&period; భారీ మెజారిటీతో గెలుపొంది అసెంబ్లీలో ఏకంగా మంత్రిగా అడుగు పెట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..