తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా..

తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా

Advertisements

<p>తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి&comma; టీవీకే అధినేత విజయ్ తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి రాజీనామా చేశారు&period; ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచిన ఆయన&comma; పెరంబూర్ నియోజకవర్గాన్ని నిలుపుకోవాలని నిర్ణయించుకున్నారు&period; ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ సెక్రటేరియట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది&period; ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పెరంబూర్&comma; తిరుచ్చి ఈస్ట్ స్థానాల నుంచి పోటీ చేసి రెండింటిలోనూ ఘన విజయం సాధించారు&period; ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం&comma; రెండుచోట్ల గెలిచిన అభ్యర్థులు ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది&period; ఈ నిబంధన మేరకే విజయ్ తిరుచ్చి ఈస్ట్‌ను వదులుకుని&comma; పెరంబూర్‌కు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయం తీసుకున్నారు&period; దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత&comma; తమిళనాడులో ఏకకాలంలో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచిన నేతగా విజయ్ నిలిచారు&period;<&sol;p>&NewLine;<p>కాగా&comma; విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి వీసీకే పార్టీ అధినేత థోళ్ తిరుమావళవన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది&period; దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది&period; టీవీకే పార్టీకి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రావడంలో వీసీకే పార్టీ సహకారం కూడా ఉంది&period; ఆ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు&period; టీవీకే పార్టీకి మద్దతు ప్రకటిస్తూ వీసీకే లేఖ ఇవ్వడంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..