తమిళనాడుకు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు …..

తమిళనాడుకు కేంద్ర హోంశాఖ హెచ్చరికలు

Advertisements

<p>తమిళనాడు రాజకీయాలు క్షణాక్షణానికీ మారుతున్నాయి&period; TVK అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ&comma; ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు స్వల్ప దూరంలో ఆగిపోవడంతో హైడ్రామా మొదలైంది&period; ఈ నేపథ్యంలో అటు కేంద్రం హెచ్చరికలు&comma; ఇటు ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలతో రాష్ట్ర రాజకీయాలు హీటెక్కాయి&period; రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని ఆసరాగా చేసుకుని అల్లర్లు జరిగే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది&period; ముఖ్యంగా రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాలు&comma; గవర్నర్ లోక్‌భవన్&comma; ఇతర కీలక ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశించింది&period; శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రధాన కూడళ్లలో కేంద్ర బలగాలను మోహరించాలని సూచించింది&period; ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అది తీవ్రమైన శాంతిభద్రతల సమస్యగా మారుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది&period;<&sol;p>&NewLine;<p>తమిళనాడులో హంగ్ ఏర్పడే సంకేతాలు రావడంతో ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడ్డాయి&period; ఈ క్రమంలో అన్నాడీఎంకేలో చీలికలు మొదలయ్యాయి&period; అన్నాడీఎంకేకు చెందిన సుమారు 27 మంది ఎమ్మెల్యేలు రాత్రికి రాత్రే పుదుచ్చేరిలోని ఒక ప్రైవేట్ రిసార్టుకు తరలి వెళ్లారు&period; సీవీ షణ్ముగం నేతృత్వంలో ఆ ఎమ్మెల్యేలంతా రిసార్టులో మకాం వేశారు&period; విజయ్ &lpar;TVK&rpar; ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా వద్దా అనే అంశంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది&period; నిన్నటి వరకు &&num;8220&semi;విజయ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని ప్రకటించిన అన్నాడీఎంకే అగ్రనాయకత్వం&comma; ఇప్పుడు ఎమ్మెల్యేల ఒత్తిడితో సందిగ్ధంలో పడింది&period; మెజారిటీ ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ఇవ్వాలని భావిస్తుండటంతో పార్టీ పట్టు కోల్పోయే ప్రమాదం ఉందని భావిస్తోంది&period; ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం&period;&period; విజయ్ ప్రమాణ స్వీకారానికి కావలసిన మెజార్టీకి ఆరుగురు ఎమ్మెల్యేల దూరంలో ఉన్నారు&period; మరి విజయ్‌కు ఏ పార్టీ మద్దతిస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..