ఒకే ఒక్క ఓటుతో ఓడిన మంత్రి పెరియకరుప్పన్

ఒకే ఒక్క ఓటుతో ఓడిన మంత్రి పెరియకరుప్పన్

Advertisements

<p>తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని సంచలనం నమోదైంది&period; రాష్ట్ర సహకార శాఖ మంత్రి&comma; డీఎంకే సీనియర్ నేత పెరియకరుప్పన్ కేవలం ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యారు&period; శివగంగై జిల్లాలోని తిరుపత్తూరు నియోజకవర్గంలో ఆయనపై&period;&period;TVK అభ్యర్థి శ్రీనివాస సేతుపతి చారిత్రక విజయం సాధించారు&period; ఓట్ల లెక్కింపులో చివరి వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొంది&period; అంతకుముందు రౌండ్లలో ఆధిక్యంలో ఉన్న పెరియకరుప్పన్‌కు తుది ఫలితం షాక్ ఇచ్చింది&period; TVK అభ్యర్థి శ్రీనివాస సేతుపతికి 83 వేల 375 ఓట్లు రాగా&comma; మంత్రి పెరియకరుప్పన్‌కు 83 వేల 374 ఓట్లు పోలయ్యాయి&period; బీజేపీ అభ్యర్థి కేసీ తిరుమారన్ 29 వేల 54 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు&period; ఈ ఫలితంతో తిరుపత్తూరులో 2006 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న పెరియకరుప్పన్ 20 ఏళ్ల అజేయ ప్రస్థానానికి తెరపడింది&period;<&sol;p>&NewLine;<p>ఫలితం వెలువడిన వెంటనే రీకౌంటింగ్ నిర్వహించాలని డీఎంకే ఏజెంట్లు కోరినప్పటికీ అందుకు అధికారులు నిరాకరించారు&period; ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాన్ని మద్రాస్ హైకోర్టులో సవాలు చేసేందుకు డీఎంకే సిద్ధమవుతోంది&period; తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసిన TVK &period;&period;108 స్థానాల్లో గెలిచి&comma; అతిపెద్ద సింగిల్ పార్టీగా అవతరించిన వేళ ఈ విజయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..