123
కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో దక్షిణకాశీగా భాసిల్లుతోన్న ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి వేలాదిమంది భక్తులు ఇక్కడకు విచ్చేసి సప్తగోదావరిలో స్నానమాచరించి. శ్రీ మాణిక్యాంబ అమ్మ వారిని, శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు, శ్రీ స్వామివారి కి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భీమేశ్వర స్వామివారి ఆలయ ప్రాగణం శివనామస్మరణతో మారుమ్రోగింది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి , మహిళలు కార్తీకదీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ,ధర్మాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.