డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం, మురమళ్ల కార్తీక మాసం అమావాస్య మహా పర్వదినం పురస్కరించుకుని మురమళ్లశ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం వారి ఆలయంలో దీపోత్సవ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా మంగళవారం జరిగింది. భక్తులు వెలిగించిన దీపాళ కాంతులతో ఆలయం కళకళలాడింది. కార్యక్రమంలో పాల్గొన్న ముమ్మిడివరం ఎంఎల్ఏ పొన్నాడ సతీష్ కుమార్, ఆలయం కమిటీ చైర్మన్ వాసురాజు లతో పాటు పలువురు నాయకులు.ఆలయంలో ప్రత్యేక పూజలు… ఆకర్షనీయంగా నిలిచిన మంచుకొండల నడుమ శివలింగం సెంటింగ్. ముమ్మిడివరం శాసన సభ్యులు శ్రీ పొన్నాడ వెంకట సతీష్.కుమార్, చైర్మన్ శ్రీ పెన్మత్స వాసురాజు దంపతులు, కార్యనిర్వాహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. తొలుత పార్థీవ లింగానికి ఆలయ అర్చకులు , పురోహితులు ఆధ్వర్యంలో అభిషేకం ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ఆవరణ చుట్టూ దేవతా మూర్తుల ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆలయ వెలుపల, బయట దీపాలంకరణ తో ఆలయం కళకళలాడింది. మండల నలుమూలల నుండి భక్తులు దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయం పచ్చి పూల అలంకరణ తో సర్వాంగసుందరంగా అలంకరించారు.సత్యసాయి సేవా ట్రస్ట్ సేవకులు, సమరసత సేవ ట్రస్ట్ నుండి విశేషసేవలందించారు. కార్యనిర్వాహణాధికారి శ్రీ మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, సర్పంచ్ కాలే రాజబాబు, పెన్మత్స చిట్టిరాజు, మాజీ చైర్మన్ లు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు.
month of Kartik
కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో దక్షిణకాశీగా భాసిల్లుతోన్న ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి వేలాదిమంది భక్తులు ఇక్కడకు విచ్చేసి సప్తగోదావరిలో స్నానమాచరించి. శ్రీ మాణిక్యాంబ అమ్మ వారిని, శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు, శ్రీ స్వామివారి కి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భీమేశ్వర స్వామివారి ఆలయ ప్రాగణం శివనామస్మరణతో మారుమ్రోగింది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి , మహిళలు కార్తీకదీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ,ధర్మాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కార్తీకమాసం హిందువులకు చాలా పవిత్రమైన నెల. ఈ నెలలో అనేక ముఖ్యమైన పండుగలు మరియు ఉత్సవాలు జరుపుకుంటారు. కార్తీకమాసంలోని కొన్ని ముఖ్యమైన రోజులు ఇక్కడ ఉన్నాయి. కార్తీక శుద్ధ త్రయోదశి ఈ రోజున శివుడిని పూజిస్తారు. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. కార్తీక శుద్ధ చతుర్దశి ఈ రోజున నరక చతుర్దశి అని పిలుస్తారు. ఈ రోజున నరక లోకంలో ఉన్న వారికి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, రాత్రిపూట అగ్నిలో భక్తితో హారతి ఇస్తారు. కార్తీక శుద్ధ పౌర్ణమి ఈ రోజున శ్రీ పార్వతీదేవిని మరియు శివుడిని పూజిస్తారు. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని మరియు పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కార్తీక శుద్ధ అమావాస్య ఈ రోజున కార్తీక అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున శివుడిని పూజిస్తారు. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయని మరియు పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. కార్తీకమాసంలోని ఇతర ముఖ్యమైన రోజులు కార్తీక శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ద్వాదశి, కార్తీక శుద్ధ పాడ్యమి, ఈ రోజున శివుడిని పూజిస్తారు. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని మరియు పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. కార్తీకమాసంలో భక్తులు శివుడిని పూజించడానికి, శివాలయాలకు వెళ్ళడానికి, శివుని స్తోత్రాలు మరియు శివ పురాణాలను చదవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతారు.





Total views : 147641