75
ఏపిఎస్ ఆర్టీసీకి ఆదాయానికి కేటుగాళ్లు భారీగా గండి కొడుతున్నారు. విశాఖలో కలాసీలను సొంత వాహనాల్లో సరుకు రవాణా చేస్తున్నారు. ఇంటర్సిటీ ట్రాన్స్ పోర్ట్ కోసం ప్రైవేటు వ్యక్తుల వాహనాల్లో సరుకును తరలిస్తున్నారు. ప్రైవేట్ వాహనాలపై యధేచ్చగా ఏపీఎస్ఆర్టీసీ బోర్డులు పెట్టుకుని సరుకును తరలిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల్లో సరుకు రవాణా చేస్తున్నా ఆర్టీసీ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తుండటం గమనార్హం. పబ్లిక్ గా ఇలా జరుగుతుంటే ఆర్టీసీ ఎప్పటికీ లాభాల్లోకి రాదని ఉద్యోగులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా విశాఖ ఆర్టీసీ అధికారులు పట్టించుకోక పోవడంతో ఉద్యోగులు మండిపడుతున్నారు.