తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం కాలినడకన కొండకు చేరుకునే భక్తుల రక్షణకు టీటీడీ, అటవీశాఖ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.

Advertisements

<p>తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం కాలినడకన కొండకు చేరుకునే భక్తుల రక్షణకు టీటీడీ&comma; అటవీశాఖ తీవ్ర కసరత్తు చేస్తున్నాయి&period; అందులో భాగంగా కృత్రిమ మేధ &lpar;ఏఐ&rpar; ఆధారిత కెమెరాలు&comma; అత్యాధునిక డ్రోన్లతో పహారా కాస్తోంది&period; ఈ ఆధునిక నిఘా నేత్రాలు వివిధ జంతువుల కదలికలను ఇట్టే పసిగట్టి వాటిని అటవీ ప్రాంతంలోకి తరిమేలా సహాయపడతాయి&period;చెన్నైకి చెందిన &OpenCurlyQuote;ధీరా’ అనే సంస్థ రూపొందించిన AI కెమెరాలు సౌరశక్తితో పని చేస్తాయి&period; ఈ కెమెరాలు 360 డిగ్రీల కోణంలో ఉంటూ 400 మీటర్ల దూరంలోని దృశ్యాలనూ సైతం స్పష్టంగా బంధిస్తాయి&period; ఎలుగుబంటి&comma; చిరుత&comma; వన్యప్రాణుల కదలికలను గుర్తిస్తాయి&period; అనంతరం ఆ విషయాన్ని వెంటనే మొబైల్‌ యాప్‌&comma; తిరుమలలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరవేస్తాయి&period; అంతేగాక కెమెరా వద్ద ఉన్న అలారం సైరన్‌ మోగిస్తుంది&period; దీంతో ఆ శబ్దాలకు అక్కడ ఉన్న జంతువులు అడవిలోకి వెళ్లిపోతాయి&period; అప్పటిలోగా సందేశం అందుకున్న అధికారులు అప్రమత్తమై శ్రీవారి భక్తులను సురక్షిత ప్రాంతాలకు మళ్లిస్తారు&period; ఇలా భక్తుల నడక మార్గంలో రెండు వైపులా 110 నుంచి 125 కెమెరాలను 4 దశల్లో ఏర్పాటు చేయనున్నారు&period; అందులో భాగంగా మొదటి విడతగా నరసింహస్వామి ఆలయ మార్గంలో 12 కెమెరాలను అమర్చారు&period;<&sol;p>&NewLine;<p>ఈ కెమెరాలతో పాటు &OpenCurlyQuote;జేరా’ అనే పేరుతో రెండు అత్యాధునిక డ్రోన్లను సైతం టీటీడీ రంగంలోకి దించింది&period; ఈ డ్లోన్లు జంతువుల సంచారం ఎక్కువగా ఉండే నో-ఫ్లై జోన్‌కు వెలుపల సాయంత్రం 6&period;30 గంటల నుంచి&comma; ఐదు కిలోమీటర్ల పరిధిలో విహరిస్తాయి&period; వీటికి ప్రత్యేకంగా లైట్లు&comma; స్పీకర్లు అమర్చడంతో జంతువులను గుర్తించిన వెంటనే శబ్దాలు చేసి&comma; తరిమికొడతాయి&period; తెలంగాణ రాష్ట్రానికి చెందిన దాత సత్యప్రసాద్‌ సహకారంతో రూ&period;4 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p>అలిపిరి మెట్ల మార్గం&comma; ఘాట్‌రోడ్ల పరిధిలో ఇటీవల చిరుత పులుల కదలికలు పెరుగుతున్నాయి&period; ఈ నేపథ్యంలోనే మానవ &&num;8211&semi; వన్యప్రాణి ఘర్షణల నివారణ చర్యలపై టీటీడీ ఉన్నతాధికారులు ఇటీవలే సమీక్షా సమావేశం నిర్వహించారు&period; అటవీ శాఖ&comma; వివిధ విభాగాల అధికారులతో మాజీ ఈవో శ్యామలరావు&comma; అదనపు ఈవో వెంకయ్య చౌదరి చర్చించారు&period; ప్రధానంగా అలిపిరి మెట్ల మార్గంలో అదనపు సిబ్బంది కేటాయింపు&comma; ఎప్పటికప్పుడు చెత్త తొలగింపు వంటి చర్యలతో పాటు తక్షణ&comma; దీర్ఘకాలిక చర్యల రూపకల్పనలో వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్&comma; అటవీశాఖల సహకారం మొదలైన విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.