టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు..

టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

Advertisements

<p>తిరుమల శ్రీవారి భక్తుల కు సత్వర దర్శనం కల్పించడమే పరమావధిగా టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది&period; సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జులై 15à°µ తేదీ వరకు వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది&period; దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడంతో పాటు అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనుంది&period; తిరుమల ఆధ్యాత్మిక శోభను పెంచేలా అక్కడి వీధులకు కొత్త పేర్లు పెట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది&period;ఆధ్యాత్మిక సేవే కాకుండా కళలకు&comma; ఉద్యోగుల సంక్షేమానికి టీటీడీ అగ్రతాంబూలం ఇచ్చింది&period; ప్రముఖ సంగీత విద్వాంసురాలు శోభారాజ్‌ని టీటీడీ ఆస్థాన విద్వాంసురాలుగా నియమించింది&period; ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన బోర్డు టీటీడీ హెల్త్ స్కీమ్ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచింది&period; ఇక ఉద్యోగుల ఇంటి స్థలాల అభివృద్ధికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్&comma; ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోరికను సైతం నెరవేర్చింది&period;ఇకపై కాంట్రాక్ట్&comma; ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా అధికారిక ఐడీ కార్డులు&comma; స్వామివారి దర్శనం&comma; లడ్డూ కార్డులు మంజూరు చేయాలని టీటీడీ నిర్ణయించింది&period; ఈ నిర్ణయాల ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందిలో నూతనోత్సాహం నింపడమే కాకుండా సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలందించే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది&period;<&sol;p>&NewLine;<p>టీటీడీ పాలక మండలి సమావేశంలో 82 అంశాలపై చర్చించారు&period; తిరుమలలోని ఆళ్వార్‌ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు శౌచాలయాల నిర్మాణాలకు 4&period;54 కోట్ల రూపాయల నిధుల మంజూరు చేయాలని నిర్ణయించింది&period; గోగర్భం డ్యామ్‌ నుంచి ఫిల్టర్‌ హౌస్‌ వరకు 6 కోట్ల రూపాయలతో పైపు లైన్లు&comma; 44&period;2 కోట్ల రూపాయాల వ్యయంతో ఏపీకి చెందిన ఆప్కో&comma; తమిళనాడుకు చెందిన కో ఆప్‌టెక్స్‌ సంస్థల నుంచి పట్టు వస్త్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు&period; అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని జీ- స్క్వేర్‌ సంస్థ తితిదే పేరిట రిజిస్టర్‌ చేసిన 19&period;49 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు&period; రాష్ట్ర రాజధాని అమరావతిలోని శ్రీవారి ఆలయంలో నూతన మండపాల నిర్మాణానికి 36&period;9 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయనున్నారు&period; పాలక మండలి తీసుకున్న ఈ సమగ్ర నిర్ణయాలు అటు భక్తుల నుంచి ఇటు సిబ్బంది నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..