విద్యార్థులపై భారం తగ్గించేందుకు వచ్చే సంవత్సరం నుంచి 10, 12 తరగతులకు రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దానినే ఎంచుకోవచ్చని తెలిపారు. కొత్త జాతీయ విద్యా విధానం – ఎన్ఈపీ లో భాగంగా ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలను ప్రతిపాదించిన సంగతిని గుర్తుచేశారు. ఏడాదిలో 10 రోజులు విద్యార్థులు బ్యాగులు లేకుండా బడికి వచ్చేలా చూడాలని.. ఆ రోజుల్లో కళలు, సంస్క్కతి, క్రీడలు, తదితర కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయాలని సూచించారు. రెండుసార్లు బోర్డు పరీక్షల నిర్వహణ ద్వారా విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం దొరుకుతుందని.. దీంతో మంచి మార్కులు సాధిచేందుకు వీలు కలుగుతుందని ప్రధాన్ తెలిపారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.