83
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు సావరగూడెం చెరువులో పడి గల్లంతై ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతులు విజయవాడ పటమట కు చెందిన వారిగా గుర్తించారు. ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా ఈత కోసం రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విజయవాడ ఎన్ఎస్ఎమ్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు.. ఫోటో షూట్ నిమిత్తం సావరగూడెం శివారు కొండ చెరువు వద్దకు చేరుకున్నారు. మృతులు గుజ్జర్లపూడి అంకిత్(15), నడికుదిటి శశి వర్ధన్(14)గా గుర్తించారు.