84
గంజాయి అక్రమ అమ్మకాలపై పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ… స్మగ్లర్లు మాత్రం ఏదో విధంగా అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. పీడీ యాక్టులు ప్రయోగించినా ఫలితం లేకుండా పోతోంది. తిరుపతి జిల్లా వెంకటగిరిలో రోజురోజుకు గంజాయి అమ్మకాలు పెరిగిపోతూనే ఉన్నాయి. గంజాయి అక్రమ అమ్మకాలపై సెబ్ అధికారుల దాడులు నిర్వహించారు. వెంకటగిరి పట్టణం అంబేడ్కర్ నగర్ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు చేస్తున్న ఆరవ రమణయ్య, రవణమ్మ అనే దంపతుల ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో 35 వేల రూపాయల విలువగల కేజీ 600 గ్రాముల గంజాయిని సీజ్ చేసి, నిందితులను అరెస్టు చేశామని సెబ్ సిఐ తెలిపారు. గంజాయి అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు.