పశ్చిమాసియాలో మళ్లీ మొదటికొచ్చిన పరిస్థితి..

Advertisements

<p>పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది&period; పాకిస్థాన్‌ వేదికగా అమెరికా &&num;8211&semi; ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో&&num;8230&semi; మళ్లీ యుద్ధం మొదలయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి&period; ఇప్పటికే ఈ దిశగా ట్రంప్‌ అనేక సూచనలు కూడా ఇచ్చారు&period; దీంతో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో నెలకొంది&period; ఈ సారి గనక మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంటే&period;&period; కచ్చితంగా దాని ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు&period; పాక్ వేదికగా శాంతి చర్చలు విఫలం&period;&period;మళ్లీ ట్రంప్ హెచ్చరికలు&period;&period;ఇరాన్ దూకుడు తాజాగా పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలకు ఆజ్యంపోస్తున్నాయి&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>ఇరాన్‌ విషయంలో తమ తదుపరి ప్రణాళికల గురించి&period;&period; సోషల్‌ మీడియాలో పరోక్షంగా ప్రస్తావించిన ట్రంప్‌&&num;8230&semi; ఇరాన్ అమెరికా డిమాండ్లకు లొంగకపోతే తన దగ్గరున్న ఏకైక అస్త్రం నౌకాదళంతో దిగ్బంధనమే అని చెప్పారు&period; ఇరాన్‌ నౌకలను కదలనీయకుండా చేసి&&num;8230&semi; ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలన్నది ట్రంప్‌ వ్యూహంగా కనిపిస్తున్నట్లు అమెరికన్‌ మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి&period; గతంలో వెనెజువెలా విషయంలోనూ ట్రంప్‌ ఇదే ఫార్ములాను వాడి సక్సెస్‌ అయ్యారు&period; అందువల్ల ఇరాన్‌ మీద కూడా అదే వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉందని మీడియా వర్గాలు చెబుతున్నాయి&period;<br &sol;>&NewLine;అమెరికా-ఇరాన్‌ మధ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో&&num;8230&semi; ప్రస్తుతం అమల్లో ఉన్న తాత్కాలిక విరమణ ఒప్పందం ముగిసిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి&period; దీంతో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడే సూచనలున్నాయి&period; ఇప్పటికే ఆ దేశ వైమానిక దళాన్ని తీవ్రంగా దెబ్బ తీసిన అమెరికా&period;&period; ఈ సారి చమురు కేంద్రాలతో పాటు&period;&period; పౌర మౌలిక సదుపాయాలపైనా దాడులకు పాల్పడే అవకాశం ఉంది&period; అటు ఇరాన్‌ కూడా అంతే గట్టిగా ప్రతిఘటించే పరిస్థితులున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియాలోని చమురు క్షేత్రాలను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకోవచ్చు&period; అదే జరిగితే&period;&period; సౌదీ&comma; యూఏఈ&comma; బహ్రెయిన్&comma; కువైట్‌ వంటి గల్ఫ్‌ దేశాలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది&period; ఇప్పటికే ఈ దేశాలన్నీ ఇరాన్‌ దాడులతో తీవ్రంగా నష్టపోయాయి&period; ఒకప్పుడు పర్యాటక ప్రాంతాలుగా విలసిల్లిన దేశాలు&period;&period; నేడు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నాయి&period; టూరిస్టులు లేక బోసిపోతున్నాయి&period; దీంతో పాటు పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలకు కూడా ముప్పు పొంచి ఉంది&period; అలాగే అటు ఇజ్రాయెల్‌తో ఇప్పటికే కయ్యం పెట్టుకున్న లెబనాన్ కు ఇప్పటికే యుద్ధం విస్తరించింది&period; &comma; సిరియాకు కూడా విస్తరించే అవకాశం ఉంది&period; ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికాస్థావరాలు&comma; చమురు కేంద్రాలపై కూడా మళ్లీ ఇరాన్ దాడులను ముమ్మరంచేసే అవకాశాలున్నాయి&period;&period;<&sol;p>&NewLine;<p>ఇరాన్‌తో చర్చలు విఫలమైన వేళ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు&period; హర్మూజ్‌ను తెరుస్తామని ఇరాన్ చేసిన వాగ్దానాన్ని విస్మరించిందన్నారు&period; హర్మూజ్‌ను దిగ్బంధించాలని తమ నౌకాదళాన్ని ఆదేశించినట్లు చెప్పారు&period; జలసంధిలోకి నౌకలు ప్రవేశించకుండా అమెరికా నౌకలు త్వరలో ఆపరేషన్‌ మొదలుపెడతాయన్నారు&period; అంతర్జాతీయ జలాల్లో ఇరాన్‌కు సుంకం చెల్లించిన ప్రతి నౌకను వెంబడించి అడ్డుకోవాలని తమ నౌకాదళానికి ఆదేశాలు ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు&period; చట్టవిరుద్ధమైన ఈ టోల్ చెల్లించే ఎవరికీ అంతర్జాతీయ సముద్రాలపై సురక్షితమైన ప్రయాణం ఉండబోదన్నారు&period; సరైన సమయంలో ఇరాన్‌ను అంతం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు&period; జలసంధిలో ఇరాన్‌ అమర్చిన మందుపాతరలను ధ్వంసం చేస్తామన్నారు&period; తమపై&comma; శాంతియుతంగా వెళ్లే నౌకలపై దాడులు చేస్తే ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందన్నారు&period;<br &sol;>&NewLine;ఇరాన్‌ చర్చల్లో అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ&period;&period; అణుశక్తి విషయంలో అంగీకారం కుదరలేదని ట్రంప్‌ పేర్కొన్నారు&period; అణు కార్యక్రమాన్ని విడిచిపెట్టేందుకు ఇరాన్ సిద్ధంగా లేకపోవడం వల్లే చర్చలు బెడిసికొట్టాయన్నారు&period; ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్‌ చేతికి అణ్వాయుధాలు చిక్కనివ్వనని తేల్చిచెప్పారు&period;ఇరాన్‌ నౌకాదళం&comma; వాయుసేన నాశనమైందని&period;&period; గగనతల రక్షణ&comma; రాడార్‌ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ట్రంప్‌ పేర్కొన్నారు&period; ఖమేనీ సహా అనేక మంది ఇరాన్‌ నేతలు మరణించారని&period;&period; ఇదంతా వారి అణ్వాయుధాల ఆశయం వల్లేనని అన్నారు&period; హర్మూజ్‌ దిగ్బంధనం త్వరలో ప్రారంభమవుతుందని&comma; ఇందులో ఇతర దేశాలు కూడా భాగస్వామ్యమవుతాయన్నారు&period; చట్టవిరుద్ధంగా ఇరాన్‌ ప్రయోజనం పొందడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్ మరింత రెచ్చగొట్టేలా మారాయి&period;&period;<&sol;p>&NewLine;<p>పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా- ఇరాన్‌ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి&period; అర్ధంతరంగా చర్చలను ముగించి జేడీ వాన్స్‌ బృందం వెనక్కి వెళ్లిపోయింది&period; అనేక గంటలు సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో ఇరుదేశాల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు&period; చర్చలు ముగిసిన అనంతరం వాన్స్‌ ఇస్లామాబాద్‌లో జేడీ వాన్స్‌ మాట్లాడుతూ&&num;8230&semi; 21 గంటలు నిరంతాయంగా ఇరాన్‌ తో తాము చర్చలు జరిపామన్నారు&period; అనేక కీలకమైన విషయాలపై చర్చించినట్లు వెల్లడించారు&period; అయితే&comma; ఈ చర్చల్లో ఎలాంటి ఒప్పందానికి రాలేకపోయామని స్పష్టం చేశారు&period; ఒప్పందానికి అనుకూలంగా తాము షరతలు విధించామని&period;&period; కానీ వాటిని ఇరాన్‌ ప్రతినిధులు అంగీకరించలేదని వాన్స్‌ పేర్కొన్నారు&period; చర్చల్లో తాము చాలా సానుకూలంగా వ్యవహరించామన్నారు&period; సద్భావనతో ఇక్కడికి వచ్చి&period;&period; ఒక ఒప్పందం చేసుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేశామన్నారు&period; కానీ&comma; దురదృష్టవశాత్తు ఎలాంటి పురోగతి సాధించలేకపోయామన్నారు&period; ఇది అమెరికా కంటే&period;&period; ఇరాన్‌కే దురదృష్టకర వార్తగా పేర్కొన్నారు&period; ఎలాంటి ఒప్పందం కుదరకుండానే తాము&period;&period; అమెరికాకు తిరిగి వెళ్లిపోతున్నట్లు వెల్లడించారు&period;మరోవైపు అమెరికాతో శాంతి చర్చలు విఫలమవడంపై ఇరాన్‌ స్పందించింది&period; హర్మూజ్‌ జలసంధి&comma; ఇరాన్‌ అణు హక్కులు వంటి కీలక అంశాలపై ప్రతిష్ఠంభన కారణంగానే ఇవి విఫలమయ్యాయని ఆ దేశ మీడియా పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p>అమెరికా-ఇరాన్ శాంతి చర్చల సమయంలోనూ ఇజ్రాయిల్ దాడులు కొనసాగించింది&period; లెబనాన్ టార్గెట్ గా వైమానిక దాడులకు దిగింది&period; ఈ కారణంగానే ఇరుదేశాల శాంతి చర్చలు విఫలమైనట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి&period; ఇరాన్ యురేనియం నిల్వలు కొల్లగొట్టాలనే సంకల్పంతో యుద్ధాన్ని ఎగదోసిన అమెరికా వ్యూహాన్ని&period;&period;తనకు అనుకూలంగా ఇజ్రాయిల్ మార్చుకోవడంతో ట్రంప్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది&period; యుద్ధం నుంచి వైదొలగలేక&period;&period;కొనసాగించలేక&period;&period;పాకిస్థాన్ ను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు&&num;8230&semi;ట్రంప్ ఇంటా బయటా అభాసుపాలుకాక తప్పలేదు&period;&period;ప్రపంచాన్ని సైనికంగా శాసించగలిగే సత్తా ఉన్న అమెరికా ఇరాన్ వ్యూహాన్ని నిలువరించడంలో వైఫల్యం చెందిందనీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు&period; ఇంకా అగ్రరాజ్యమనే దురహంకారం నుంచి ట్రంప్ మాత్రం బయటపడడం లేదు&period;&period;ఇరాన్ పై హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు&period; యుద్ధం మొదలు పెట్టింది అమెరికా అయినా&&num;8230&semi;ముగించేది తామేనంటోంది ఇరాన్&period; తమ ఆత్మగౌరవ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రతిఘటినా యుద్ధాన్ని కొనసాగిస్తోంది&&num;8230&semi;పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారే పరిస్థితి దరిదాపుల్లో లేదని పరిణామాలు రుజువు చేస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ఫిబ్రవరి 28à°¨ ఇరాన్‌పై అమెరికా&comma; ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసి&comma; సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హతమార్చిన తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి&period; దీనికి ప్రతిగా ఇరాన్ క్షిపణి&comma; డ్రోన్ దాడులతో విరుచుకుపడింది&period; బుధవారం నుంచి రెండు వారాల కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ&comma; ఇజ్రాయెల్ లెబనాన్‌పై భారీ దాడి చేసి 300 మందికి పైగా పౌరులను చంపింది&period; ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్‌లో అమెరికా&comma; ఇరాన్ చర్చలకు 15 రోజుల డెడ్‌లైన్‌ను ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పెట్టింది&period; ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి వచ్చిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రాతిపదికన ఈ గడువును విధించింది&period; 15 రోజుల డెడ్‌లైన్ ప్రకారం&comma; కాల్పుల విరమణ ఒప్పందం ఏప్రిల్ 22à°¨ ముగియనుంది&period; అప్పట్లోగా అమెరికా &&num;8211&semi; ఇరాన్‌లు పరస్పర అవగాహనకు రావాల్సి ఉంటుంది&period; కానీ&period;&period; పాకిస్తాన్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ శాంతిచర్చలు విఫలం కావడంతో మళ్లీ మొదటికొచ్చింది&period; పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నది&period; దీని ప్రభావం ప్రపంచ వాణిజ్యంపై తీవ్రంగా ఉంటుందనే ఆందోళన ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..