సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు పర్యటించారు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వంత నియోజికవర్గం కావడం పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చాక ఉత్తమ్ మొదటి సారి హుజూర్ నగర్ కి రావడంతో కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చారు. మంత్రి హోదాలో మొదటిసారి రావడంతో జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగంతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం మంత్రి క్యాంప్ ఆఫీస్ పక్కనే గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో ఆయన స్వయంగా నిర్మింప తలబెట్టిన మోడల్ కాలనీ ఇళ్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఇరువురు మంత్రులు మాట్లాడుతూ గతంలో తమ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు తప్ప పదేళ్ల BRS ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా పేదవాడికి నిర్మించలేదన్నారు. మూడు నెలల్లో ఈ మోడల్ కాలనీలో ఉన్న అన్ని ఇళ్లను పూర్తి చేసి అర్హులైన పేదవారికి అందజేస్తామన్నారు. తాము ఎన్నికలలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు.
మోడల్ కాలనీ ఇళ్లను పరిశీలించిన ఉత్తమ్..
86
previous post