ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ వలే పనిచేస్తుంది. పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బరువు తక్కువగా ఉండి సన్నగా ఉండే వారికి ఇవి చాలా బాగా సహాయపడుతాయి. అలాగే కర్జూరాలను రాత్రంతా పాలలో నానబెట్టి ఉదయం మిక్సీలో వేసి జ్యూస్ లా తయారు చేసి తాగడం వల్ల శరీరానికి కావల్సిన న్యూట్రిషియన్స్ అధికంగా అందుతాయి. దాంతో రోజంతా పనిచేయడానికి కావల్సిన శక్తి అందుతుంది. ఆకలిగా ఉన్నప్పుడు..మూడ్ సరిగా లేనప్పుడు చాక్లెట్స్ కు బదులు కర్జూరాలను తినడం వల్ల మంచి మూడ్ తో ఉత్సాహంగా పనిచేయగలరు. కర్జూరంలో అధిక శాతంలో అంటే అరటి పండులో కంటే ఎక్కుంగా పొటాషియం కలిగి ఉంటుంది. ఇది గుండె కొట్టుకోవడానికి చాలా సహాపడుతుంది. బ్లడ్ లెవన్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. కర్జూరాలను రెగ్యులర్ గా తినడం వల్ల గుండె నొప్పిని రాకుండా అడ్డుకోవచ్చు. అంతే కాదు ఇందులో ఉండే ఐరన్ క్రోనిక్ అనీమీయా రాకుండా కాపాడుతుంది. కర్జూరంలో విటమిన్స్ కన్నా అమీనో యాసిడ్స్ అధిక శాతంలో ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలకు బాగా సహాపడుతాయి. కర్జూరంలో ఇంకా పెక్టిన్ అనే రసాయనం ఉండటం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్ ను అదుపులో ఉంచుతుంది. కర్జూరాలను తరచూ తినడం వల్ల ఆబ్డామినల్ క్యానర్ రాకుండా కాపాడుతుంది. అంతే కాదు కర్జూరాలు గర్భిణీ స్త్రీలకు చాలా ఆరోగ్యకరం. వారు ఇవి తినడం వల్ల ప్రసవం సులభతరం అవుతుంది. గర్భిణీ స్త్రీకి కావల్సిన కె విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. కర్జూరంలో దంతక్షయాన్ని పోగొడుతాయి. ఇందులో ఉండే ప్లోయిరిన్ దంతాలు గంటిగా ఉండేలా సహాపడి, త్వరగా ఊడిపోకుండా కాపాడుతాయి. ఇంకా బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సెక్స్యూవల్ స్టామినా ను పెంచుతుంది. ఎముకల పెరుగుదలకు బాగా సహాపడుతుంది. ఇన్నిఆరోగ్య ప్రయోజనాలు కలిగించే కర్జూరాలను కేక్స్, కుక్కీస్ లలో విరివిగా ఉపయోగిస్తుంటారు. నేడు ఖర్జూరాలను స్వీట్ల తయారీలో కూడా వాడుతున్నారు. పంచదారకు బదులుగా ఖర్జూరాలను వాడితే ఆరోగ్యానికి హాని కలుగకుండా తియ్యదనం వస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే వీటిలో ఉన్నది సహజసిద్ధమైన తియ్యదనం. కాబట్టి కర్జూరాలను మీ రెగ్యులర్ డైయట్ లో చేర్చి ఆరోగ్యంగా అందంగా జీవించండి.
ఖర్జూరంలోని విలువైన ఆరోగ్య ప్రయోజనాలు…!
72
previous post