89
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వశిష్ట గోదావరిలో మార్గశిర పాడ్యమి పోలిస్వర్గం పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో పట్టణంలోని వలందర్, అమరేశ్వర స్నానాల రేవులు భక్తులతో కిటకిటలాడాయి. స్నానమాచరించి గోదావరి గట్టుపై పూజలు చేసి అనంతరం పాడ్యమి దీపాలను నదిలో విడిచిపెట్టారు. పోలిస్వర్గoగా పిలుచుకునే పూజా కార్యక్రమానికి ఎంతో విశిష్టత ఉంది. కార్తీక మాసంలో పూజా కార్యక్రమాలు చేయలేని భక్తులు పాడ్యమి రోజున నదిలో పుణ్య స్నానం చేసి 30 దీపాలు విడిచి పెడితే కార్తీక మాసంలో నెల రోజుల పాటు చేసే పూజా కార్యక్రమాలకు వచ్చేంత పుణ్య ఫలం లభిస్తుందన్నది భక్తుల నమ్మకం.