తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు తలపతి విజయ్ మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యాడు.

తమిళనాడులో ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారు?

Advertisements

<p>తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు&comma; ప్రముఖ నటుడు తలపతి విజయ్ మరో వివాదానికి కేంద్ర బిందువు అయ్యాడు&period; తన ఎన్నికల ప్రచారంలో భాగంగా పావురం ఎగురవేసిన ఘటనపై జంతు సంక్షేమ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి&period; ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా&comma; విజయ్ తన పార్టీ జెండా రంగులను వేసిన పావురాలను గాలిలోకి ఎగురవేశారు&period; శాంతికి చిహ్నంగా భావించే పావురాలకు ఇలా కృత్రిమ రంగులు పూయడం&comma; వాటిని రాజకీయ ప్రచారానికి వాడుకోవడంపై సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో&comma; అంతర్జాతీయ జంతు సంక్షేమ సంస్థ PETA ఇండియా రంగంలోకి దిగి విజయ్‌కు ఘాటుగా లేఖ రాసింది&period;<&sol;p>&NewLine;<p>విజయ్‌కు రాసిన అధికారిక లేఖలో పెటా పలు కీలక అంశాలను లేవనెత్తింది&period; పక్షుల రెక్కలకు&comma; శరీరానికి రసాయనాలతో కూడిన రంగులు పూయడం వల్ల అవి అనారోగ్యానికి గురవుతాయని&comma; ఇది &&num;8216&semi;జంతు క్రూరత్వ నిరోధక చట్టం&&num;8217&semi; కింద నేరమని స్పష్టం చేసింది&period; మూగజీవాలను రాజకీయ ప్రయోజనాల కోసం&comma; వినోదం కోసం ఉపయోగించడం అనైతికమని&comma; ఇది వాటికి తీవ్రమైన శారీరక&comma; మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని పెటా ఆవేదన వ్యక్తం చేసింది&period; ప్రస్తుతం పార్టీ ఆధీనంలో ఉన్న మిగిలిన పావురాలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు విడుదల చేయాలని&comma; భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడబోమని హామీ ఇవ్వాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు&period; కాగా ఈ వివాదంపై విజయ్ నుంచి&comma; టీవీకే పార్టీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు&period; అయితే&comma; పార్టీలోని కొందరు కీలక నేతలు మాత్రం ఇది కేవలం సాంప్రదాయబద్ధంగా చేసిన పని అని&comma; పావురాలకు హాని కలిగించే ఉద్దేశం తమకు లేదని చెబుతున్నట్టు సమాచారం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.