ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురంలో ఎన్నికల ప్రచారంలో మధిర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. వీరికి గ్రామస్థులు, టిడిపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. లక్ష్మీపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఇప్పుడు జరిగే ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలని, దొరల తెలంగాణా కావాలా, ప్రజల తెలంగాణా కావాలా తేల్చుకునే ఎన్నికలని అన్నారు. BRS పార్టీని దించి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకోవాలనేది ప్రజల్లో ఉందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మధిర అభివృద్ధి కోసం నిధులు తీసుకోస్తామని, రైతులకు నీటి సమస్య తీర్చడం కోసం శాశ్వత పరిష్కారం చూపిస్తామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడగానే నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, మహిళలకు ప్రతి నెల 2500, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని అన్నారు. ముదిగొండ మండలం లో ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో వచ్చే ప్రతి రూపాయి పాలకులు తినకుండా ప్రజలకు పంచెటట్లుగా చూస్తామని అన్నారు. తెలంగాణా రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలైనా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలవబోతున్నామని అన్నారు. ఈనెల ముప్పైన జరిగే ఎన్నికల్లో ప్రజలు హస్తం గుర్తు పై ఓటేసి నన్ను గెలిపించండని అన్నారు.
కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చుకోవాలన్న విక్రమార్క..
89
previous post