విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో కలకలం. ప్రొఫెసర్ వేధింపులపై విద్యార్థినుల ఫిర్యాదు ..

Advertisements

<p>విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది&period; కామాంధుడైన ఓ ప్రొఫెసర్ తమను వేధిస్తున్నాడంటూ విద్యార్థినులు రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు&period; ఈ ఫిర్యాదుపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ నేరుగా కళాశాలలో పర్యటించి&comma; బాధితులతో విడివిడిగా మాట్లాడారు&period; నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు&period;<br &sol;>&NewLine;విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రొఫెసరే కీచకుడిగా మారడం చర్చనీయాంశమైంది&period;<&sol;p>&NewLine;<p>తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ విద్యార్థినులు పంపిన ఈ-మెయిల్ ఆధారంగా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ కళాశాలలో విచారణ చేపట్టారు&period; ఈ సందర్భంగా విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులను ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు&period; గత మార్చిలోనే అంతర్గత విచారణ జరిగినప్పటికీ&comma; ఫిర్యాదు చేసిన విద్యార్థినులనే టార్గెట్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు&period;అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన రాయపాటి శైలజ&period;&period; పరీక్షల విషయంలో ఇబ్బందులు పెడతారనే భయంతో విద్యార్థినులు బయటకు రావడం లేదని&comma; వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు&period; ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ను కూడా విచారించామని&comma; నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు&period; రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న వేధింపులను అరికట్టేందుకు ప్రతి జిల్లాలో సమీక్షలు నిర్వహిస్తున్నామని&comma; బాధితులు సులభంగా ఫిర్యాదు చేసేందుకు త్వరలో క్యూఆర్ కోడ్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నామని ఆమె వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.