పెద్దపల్లి ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూ ఉంటాo, బహుజన్ సమాజ్ పార్టీపై నమ్మకంతో ఓటు వేసి ప్రజాస్వామ్య విలువల్ని మరింత పెంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజా క్షేత్రంలో గెలుపు ఓటములు సహజమని బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి అసెంబ్లీ ఇన్చార్జ్ దాసరి ఉష అన్నారు. పెద్దపల్లి జిల్లా బీఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత రెండున్నర ఏండ్ల నుండి బహుజన గొంతుకగా బీఎస్పీకి కొత్త ఆశలు రేకెత్తించిన పెద్దపల్లి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు, బీఎస్పీ నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, శ్రేయోభిలాషులు నిరుత్సాహ పడవద్దు అన్నారు. ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి విజయం దిశగా సాధించేందుకు శ్రేణులను సిద్ధం చేస్తామన్నారు. పెద్దపల్లి ప్రాంత ప్రజలకు తాను ఇక్కడే ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ ఎంతటి త్యాగానికైనా సిద్ధమవుతామన్నారు. ఏదైతే బీఎస్పీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాటం చేస్తామన్నారు.
ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం.. దాసరి ఉష
63
previous post