మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది తొలిసారి పట్టణానికి విచ్చేసిన వివేక్ వెంకటస్వామికి నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజలు కోరుకున్న మార్పు ఈరోజు వచ్చిందని, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నే చెన్నూర్ ప్రజలు బట్టలు విప్పి కొట్టి పంపారని ఆయన అన్నారు. చట్టానికి ఎవరూ చుట్టం కాదని, దానికి అనుగుణంగా అందరూ నడుచుకోవాలని ఆయన తెలిపారు. మా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత 6 గ్యారంటీల పై తొలి సంతకం చేశారని, వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 68 వేల మిగులు బడ్జెట్ ను అప్పుల రాష్ట్రంగా మార్చి చేతులు దులుపుకున్నారని ఆయన మండిపడ్డారు. .కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని,కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఎంక్వైరీ వేసి తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని ఆయన అన్నారు..
వృధా అయిన ప్రజల సొమ్ము దోచుకున్న సొత్తును తిరిగి కక్కిస్తామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం చెన్నూర్ లో ఉద్యోగాల్లో, మంచి నీటి సరఫరా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ త్వరలో నెరవేరుస్తానని హామీ ఇచ్చారు..ప్రతి మండలంలో తిరిగి ఎం కావాలో,ఏమి అవసరాలు ఉన్నాయో తెలుసుకొని పరిష్కార దిశగా ముందుకెళుతానని ఆయన చెప్పారు..బ్యాక్ వాటర్ బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తానని,చెన్నూర్ ప్రజలు తమపై ప్రేమ చాలా చూపించారని,మాజీ ఎమ్మెల్యే ఓదెలు ఇతర నాయకులకు చెన్నూర్ ప్రజలకు కృత్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నారని,కొత్త నాయకులను పార్టీలో తీసుకునే అవసరం లేదని అయన స్పష్టం చేశారు.. నియోజకవర్గ అభివృద్ధి కొరకై అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఆయన వెంట నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున వున్నారు.
వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం..
83
previous post